"ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు నాటకంలో!!" అనే ఫేమస్ డైలాగ్‌తో మొదలవుతుంది ఈ సినిమా. మన రాజకీయాల్లో జరుగుతున్న సంఘటనలు, కుట్రలు, కుతంత్రాలను ఎటువంటి అతిశయోక్తి లేకుండా కళ్లకు కట్టినట్టు చూపించే చిత్రం ఈ ‘ప్రస్థానం’.
ఈ సినిమాను వెండితెరపై తెరెకెక్కించిన డైరెక్టర్ దేవ కట్ట గారి విజన్‌కి నా పాదాభివందనాలు. మీ ఈ ప్రయత్నంలో ప్రతి సీన్ మీ ఆలోచనలతో ఇతర సినిమాలకు భిన్నంగా తీశారు, మన తెలుగు సినిమా స్థాయిని ఒక మెట్టు పైకి తీసుకెళ్లారు.
మంచి కథ ఒకటి ఉంటే సరిపోదు, ఆ కథకి కధనం, మంచి దర్శకత్వం, ప్రేక్షకులను కదిలించే భావం ఉండాలి — వీటన్నిటి కలయికే ఈ ప్రస్థానం.
ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే — సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ — ఈ పాత్రల్లో నటించలేదు, ఎంతో ఆలవోకగా జీవించారు. ఇంకా ఎన్నో విషయాలు ఈ సినిమా గురించి చెప్పాలనిపిస్తోంది కానీ చూడనివారికి స్పాయిలర్ ఇవ్వకూడదని ఆగిపోతున్నాను.
ఇంకా ఎందుకు ఆలస్యం — నా లాంటి ఎంతో మందిని కదిలించి, ఒక గొప్ప అనుభూతిని కలిగించిన ఈ చిత్రాన్ని వెంటనే చూడండి. మన తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వాటిని గౌరవించడం మన ధర్మం.
ఈ సినిమాను మీరు తప్పక చూస్తారని ఆశిస్తూ...
– మీ ముస్తాక్
(IN ENGLISH)
... Ide manava 'PRASTHANAM'.
"Okkasari puranalu dhatochi choodu avasarala kosam daarulu thokke patralu thappa herolu villanlu lerii natakam lo!!" Ane famous dialogue tho modalavuthundhi ee cinema,mana rajakiyallo jaruguthunna sangatanalu, kutralu kuthanthralanu saitham ey mathram athishayam lekunda kallaki kattinattu choppinche chithram ee 'Prasthanam'
Ee cinema ni venditherapai terakekkinchina director deva katta gari vision ki na padabhi vandanalu, mee ee prayathnam lo prathi okka scene mee alochanalotho vere cinemalaku vibhinnaga teesi mana telugu cinema sthayini oka mettu paiki theeskellaru.
Manchi katha okati vunte saripodhu ah kathaki kathanam manchi dradarshathvam prekshakulanu kadhilinche bhavam undali veetanniti kalayike ee prasthanam, inka performance vishayaniki vasthe Sai Kumar ,shrvanand , Sundeep kishan ee pathralalo natinchaledhu entho alavokaga jeevincharu. Inka enno vishayalu ee cinema gurinchi cheppali ani undhi kaani choodanivallaki spoiler ivvakudadhani agipothunna.
Inka endhuku alasyam nalanti enthomandhini kadhilindchi, oka goppa anubhuthini kaliginchina ee chitram ventane chooseyyandi. Mana telugu lo ilanti cinemalu chala arudhuga vasthayi vaatini gouravaminchadam mana dharmam. Ee cinema ni meeru tappaka choostharani ashishtu...
- mee mushtaq