సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి రాసే స్థాయి, అర్హత ఉందో లేదో తెలియదు. కానీ, ఒక 21 ఏళ్ల యువకుడికి, ఒక పాట విని, ఆ పాటలోని పదాలకు ఉన్న అర్థం తెలుసుకుని, ఒక గొప్ప విషయం తెలుసుకున్నామనే భావన కలిగితే, ఒక మంచి ప్రశ్నకు సమాధానం దొరికిన ఆనందం కలిగితే, దానికి కృతజ్ఞత తెలియజేయాలని ఎప్పుడూ ఉంటుంది.
ఒక మనిషి తన జీవితంలో అనుభవించే ప్రతి దశకు సీతారామ శాస్త్రి గారి పదాలు తోడుగా ఉంటాయి.
చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే – చందమామ రావే, జాబిల్లి రావే అని పిలిచి, లాలి జో లాలి జో అంటూ నిద్రపుచ్చారు. అదే పిల్లవాడి బాల్యం ఆగిపోమన్నారు, వాడు కుర్రవాడయ్యాక కాలేజీకి వెళ్తే – Botany పాఠం, మేటినీ ఆట అంటూ మధి లో ఒక చిలిపి సంఘర్షణను పుట్టించారు. వాడు ఒక అమ్మాయితో ప్రేమలో పడితే – ఆ ప్రేమకు అర్థం కవితలు సైతం పలకని భావం అన్నారు. వాడికి ఉద్యోగం రాక, ఏం చేయాలో తెలియని స్థితిలో – వాడి మెదడు ప్రశ్నల ప్రవాహంలో పడినప్పుడు – నీ ప్రశ్నలు నీవే, ఎవరు బదులు ఇవ్వరు అంటూ నేర్పించారు. వాడిని పెళ్లి బట్టల్లో చూసి – అలాంటి రామచంద్రుడితో పోల్చారు. వాడు సాంసారిక జీవితంలోకి వెళ్లి, వృద్ధాప్యంలోకి చేరాక – తన శక్తి నశించిందని, ఒంటరి అయ్యాడని బాధపడుతుంటే – జగమత కూటుంబం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది అంటూ ధైర్యం ఇచ్చారు. చివరగా, వాడు కళ్ళు మూసుకునే సరికి – తన బరువు, తన పరువు మోసేది ఆ నలుగురే అని తన జీవితం వారికి అంకితం అని ముగించారు.
ఇలా లాలిపాట నుండి శ్రద్ధాంజలి వరకు – మనిషి జీవితంలో వచ్చే ప్రతి ధ్వనిని సీతారామ శాస్త్రి గారు విని, మన జీవితానికి కావాల్సిన ఎన్నో పాఠాలను పాట రూపంలో అందించారు.
పాదాభివందనాలతో,
సందీప్
Sahajam ga konni bhavalanu teliyajesedhi paata, paata ni mosedi padam , alanti padalannitini chala soudaryam ga oka baani (tune) ki alankarinchi , aa maadhhuryam tho prekshakudi manusu ni taakeyh prayatnam chesevaadu
Sirivennala Seetharama Sastry gari gurinchi raasey sthayi , arahatha undo ledo telidu , Kaani oka 21 yela yuvakudiki , oka paata vini aa paadaala ki unna ardam teluskuni , oka goppa vishyam telsukunnam ani , oka manchi prashna ki samandham dorikindi ani trupti ni kaliginchai, daaniki kruthgnyatha telupalani eppudu untundi
Oka manishi tana Jeevitham lo anubhavinchey prati dasha ki Seetharama Sastry gaari padaalu todayi untai
Chinna pillavadu edustu untey , aa chandama raavey jaabilli raavey ani pilichi , laali jo laali jo ani nidra puccharu, adey pillavadi baalyanni aagipomannaru , vaadu kasta kurravadu ayyaka college ki velteyh botany paatam aa matniee aata aa ani madhi lo oka chilipi sangarshana puttinchaaru , vaadu oka ammayi tho premalu paditeyh aa prema ki ardam kavithalu saitam palakani bhaavam annaru , vaadiki udhyogam raaka , em cheyyalo teliyani sthitlo ,vaadi medhadu prashnala pravaham lo padinappudu , nee prashanlu neeveyh evaru badulu ivvaru ani nerpincharu , vaadni pelli battalalo choosi alanti ramachandrudi tho polcharu , vaadi samsaara Jeevitham ayyaka , yrudhabyam loki vellaka , tana shakti nashindhi ani , ontari ayyad ani baadha padutunteyh jagamatha kutumbam naadhi , samsara saagram naadhi ,sanyasam sunyam naadhi ani dhairyam iccharu inka chivarlo aa vaadu kallu moosaka , tana baruvu , tana paruvu mosedhi aa naluguru eyh ani tana Jeevitham vallaki ankitham ani mugincharu
Ila laali paata nunchi shraddhanjali varaku manishi jeevatm lo vacchey prathi dhwani Seetharama Sastry garu vini manaki paatalu paata roopam lo andhicharu
Chivariga tanu Akshram lo kalisipoyaru ,
Enduku antey aksharaniki chaavu led antar kada
Paadhabivandanla tho Sandeep
